తైవాన్‌ ను అతలాకుతలం చేస్తున్న చాంపి తుఫాన్ : ఒకరు మృతి,94 మందికి గాయాలు : ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేత

తైవాన్‌ ను చాంపి తుఫాన్ అతలాకుతలం చేస్తోంది.చాంపి తుఫాను కారణంగా ఒకరు మృతిచెందగా 94 మంది గాయపడ్డారు. 77వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెయ్యి విమానాలు రద్దయ్యాయి. 12వందల 86 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 మీటర్ల ఎత్తు వరకు ఉన్న అలలు తైతుంగ్ తీరాన్ని తాకాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ తుఫాను 2026 సంవత్సరంలోనే అత్యంత శక్తివంతమైన ముప్పుగా మారింది. తొలుత గంటకు 296 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఈ తుఫాను, తైవాన్ వైపు వచ్చేసరికి కాస్త బలహీనపడినప్పటికీ, ఇప్పటికీ గంటకు 191 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. తుఫాను భీభత్సం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. తైవాన్‌లోని దాదాపు 20 నగరాలు, కౌంటీలలో పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులు, వ్యాపార సంస్థలు, అక్కడి ఆర్థిక మార్కెట్లను పూర్తిగా మూసివేశారు. చాంపి తుఫాన్ తో రవాణా రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. తైవాన్ వ్యాప్తంగా 260కి పైగా దేశీయ విమానాలు, 700కు పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. తైతుంగ్ కౌంటీలోని ఫుగాంగ్ ఓడరేవులో ఓ భారీ క్రేన్ అలల తాకిడికి సముద్రంలో కూలిపోయింది.


Post a Comment

Previous Post Next Post
3