సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు చెందిన ఆన్‌లైన్ పోర్టల్‌లో భద్రంగా ఉండాల్సిన 500కు పైగా సినిమాల రహస్య పత్రాలు ఇంటర్నెట్‌లో బయటపడ్డాయి. ఈ లీక్‌లో సినిమాల షూటింగ్ స్క్రిప్టులు, సెన్సార్ కట్స్ వివరాలు, నిర్మాతలు-డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగిన ఒప్పందాలు, లైసెన్సింగ్ ఫీజులకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, సినిమాల వీడియోలు లీక్ కాలేదు. సెన్సార్ సర్టిఫికేషన్ కోసం నిర్మాతలు పత్రాలను అప్‌లోడ్ చేసే 'ఈ-సినీప్రమాణ్' పోర్టల్లో భద్రతా లోపాల కారణంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. విషయం వెలుగులోకి రావడంతో లీకైన ఫైళ్లను తొలగించి, ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోర్టల్ భద్రతను సమీక్షించేందుకు సెక్యూరిటీ ఆడిట్ చేపట్టారు.
