షియోమీ దీపావళి పండుగ సందర్భంగా యూజర్ల కోసం అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ మొదలుకొని బడ్జెట్ సెగ్మెంట్లో అందించిన స్మార్ట్ ఫోన్స్ వరకు అన్ని ప్రొడక్ట్స్ పై అద్భుతమైన డీల్స్ అండ్ డిస్కౌంట్ ఆఫర్స్ ని జత చేసింది. ఈ సేల్ నుంచి షియోమీ 17 అల్ట్రాపై డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో లభిస్తోంది. షియోమీ ఈ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో రూ.1,39,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం కూడా ఇదే ప్రైస్ తో సేల్ అవుతోంది. అయితే, 2026 దీపావళి పండుగ సందర్భంగా ఈ ఫోన్ పైన రూ. 10,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఇదే కాదు ICICI, HDFC మరియు SBI వంటి ప్రధాన బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పైన కూడా రూ. 10,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. అలాగే, పాట ఫోన్ ఎక్స్ చేంజ్ పైన కూడా అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ దీపావళి సేల్ నుంచి కొనుగోలు చేసే వారికి రూ. 19,999 విలువైన Photography Kit Pro కిట్ ను ఉచితంగా అందిస్తుంది. అలాగే, 5000 Mi Points కూడా ఈ ఫోన్ కొనేవారికి అందిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ ఫోన్ ను Mi దీపావళి సేల్ 2026 నుంచి కొనుగోలు చేసే వారికి కనీసం 50 వేల రూపాయల విలువైన బెనిఫిట్స్ లభించే అవకాశం ఉంది. ఇది షియోమీ అందించిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఇది పూర్తిగా ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఇందులో 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB హెవీ స్టోరేజ్ కూడా అందించింది. ఇది డ్యూయల్ SIM అండ్ eSIM సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో పాటు డ్యూరబుల్ డిజైన్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో వెనుక 200MP టెలిఫోటో, 50MP మెయిన్ కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరాలతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఈ సెటప్ తో ఈ ఫోన్ 30 FPS తో 8K (7680x4320) వీడియో రికార్డింగ్, 120 FPS తో 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ మరియు 1920FPS అల్ట్రా స్లో మోషన్ 1080p వీడియో రికార్డింగ్ కూడా అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 50MP AF సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది కూడా 60FPS Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ ఫోన్ లో 6.89 బిగ్ Hyper RGB OLED స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ 1-120Hzఅడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2K రిజల్యూషన్, 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఐకేర్ DC డిమ్మింగ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇది Pro HDR, HDR10+ మరియు Dolby Vision వంటి ప్రీమియం ఫీచర్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 6000mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 90W వైర్డ్ హైపర్ ఛార్జ్ మరియు 50W వైర్లెస్ హైపర్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
