రెండు కొత్త హెవీ స్టీల్ ప్లేట్ బ్రాండ్లను మార్కెట్లోకి విడుదల చేసిన ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా

ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రతిష్టాత్మకమైన రెండు కొత్త హెవీ స్టీల్ ప్లేట్ బ్రాండ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గుజరాత్‌లోని హజీరాలోని తమ ఆధునిక ప్లేట్ మిల్లు కేంద్రంలో అభివృద్ధి చేసిన 'STRUCTROMAX' మరియు 'WELDSTAR' ఉత్పత్తులు అత్యున్నత నాణ్యత, ఖచ్చితమైన మెటలర్జికల్ నియంత్రణ మరియు ఆధునిక రోలింగ్, హీట్-ట్రీట్మెంట్ సాంకేతికతలతో రూపొందించబడ్డాయి. వంతెనలు, ఎత్తైన భవనాలు, రైల్వేలు మరియు విండ్ ఎనర్జీ వంటి రంగాలకు STRUCTROMAX మద్దతు ఇస్తుండగా, క్రేన్లు, మైనింగ్ పరికరాలు మరియు రవాణా వ్యవస్థల కోసం అత్యధిక బలాన్ని ఇచ్చేలా WELDSTAR రూపుదిద్దుకుంది. కస్టమర్ల సంక్లిష్ట అవసరాలను తీర్చడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ఈ ఉత్పత్తులు సుస్థిర ఉక్కు తయారీకి నిదర్శనంగా నిలుస్తాయని కంపెనీ సేల్స్ & మార్కెటింగ్ డైరెక్టర్ రాజన్ ధర్ వెల్లడించారు. ఈ కొత్త హెవీ ప్లేట్ ఉత్పత్తులు కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖకు చెందిన గ్రీన్ స్టీల్ టాక్సోనమీ ద్వారా '3-స్టార్' రేటింగ్ ధృవీకరణను సాధించాయి. ప్రతి టన్ను ఉక్కు తయారీలో వెలువడే కార్బన్ ఉద్గారాల ఆధారంగా కేటాయించే ఈ స్టార్ రేటింగ్ ద్వారా AM/NS ఇండియా పర్యావరణ అనుకూల విధానాలను అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నూతన ఆవిష్కరణలు దేశీయంగా స్థానిక తయారీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Post a Comment

Previous Post Next Post
3