దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు లక్షల సంఖ్యలో జనం పోటెత్తడం చూసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ అయ్యారు. ఖమేనీని ఇరాన్ ప్రజలు ద్వేషిస్తున్నారని అనుకున్నా, కానీ అతడి అంత్యక్రియల్లో భారీ సంఖ్యలో జనం పాల్గొని సంతాపం తెలపడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. తాను ఊహించిన దానికి అక్కడ భిన్నమైన వాతావరణం కనిపించిందని పేర్కొన్నారు. అయితే, ఖమేనీ కోసం ఇరాన్ ప్రజలు నకిలీ కన్నీళ్లు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ అగ్రనాయకత్వమంతా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఇరాన్ అగ్ర నాయకులను ఉద్దేశించి ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. ''ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ అగ్రనాయకత్వమంతా ఒక చోటకు చేరింది. మేం తలుచుకుంటే ఒక్క దెబ్బతో వాళ్లందరినీ లేపేయొచ్చు. కానీ మేం అలా చేయం. ఎందుకంటే ఆ తర్వాత చర్చలు జరపడానికి అక్కడ ఎవరూ మిగలరు'' అని ట్రంప్ వ్యంగ్యస్త్రాలు సంధించారు.
ఖమేనీని ఇరాన్ ప్రజలు ద్వేషిస్తున్నారని అనుకున్నా, జనాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యా : డొనాల్డ్ ట్రంప్
byTelugu Lo Computer
•
•
2 min read