జూలై 20 నుండి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

జూలై 20 నుండి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై ఉభయ సభలలోనూ అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన తర్వాత, ఉభయ సభలను సమావేశపరచాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న కిరణ్ రిజిజు వెల్లడించారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాల కోసం 2026 జూలై 20 నుండి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి.

Post a Comment

Previous Post Next Post
3