ఉజ్బెకిస్తాన్‌లో తోటి విద్యార్థి దాడిలో ప్రాణాలు కోల్పోయిన కేరళ విద్యార్థిని

ఉజ్బెకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న కేరళకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని సవారియా తోటి విద్యార్థి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఉజ్బెకిస్తాన్‌లో ఉంటున్న మలప్పురంలోని పెరింతల్‌మన్నకు చెందిన విద్యార్థి సధారుల్ అనామ్‌ను ఉజ్బెకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సవారియా, నిందితుడికి మధ్య నాలుగు రోజుల క్రితం ఒక చిన్న వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అనామ్, సవారియా తలపై ల్యాప్‌టాప్‌తో బలంగా బాదాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, అంతర్గత రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ సవారియా మృతి చెందింది.

Post a Comment

Previous Post Next Post
3