ఓపెన్ ఏఐ పలు సర్వీస్ లు డౌన్ అయినట్లు యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా, చాట్ జిపిటి సర్వీసులో తీవ్ర అంతరాయం కలిగినట్లు యూజర్లు ప్రముఖ రిపోర్టింగ్ ప్లాట్ ఫామ్ డౌన్ డిటెక్టర్ లో రిపోర్ట్ చేశారు. మేము చేసేటప్పుడు కూడా చాట్ జిపిటి సర్వీసులకు అంతరాయం కలగడాన్ని గుర్తించాము. ఇక లైవ్ లో అందుతున్న రిపోర్ట్స్ ను కూడా గమనించిన తర్వాత ఈ విషయం నిజమే అని నిర్ధారణకు వచ్చాము. ఓపెన్ ఏఐ ప్రముఖ ప్లాట్ఫారం చాట్ జిపిటి ప్రస్తుతం యూజర్లకు తలనొప్పిగా మారింది. చాట్ జిపిటి ఈరోజు సాయంత్రం 5 గంటల 21 నిమిషాల నుంచి సరిగ్గా పనిచేయడం లేదని యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మినిమం గా రిపోర్ట్ అందుకున్నట్లు మేము గమనించాము. అయితే, ఈ రిపోర్ట్ కౌంట్ మెల్లగా పెరుగుతున్నట్లు కూడా మేము గుర్తించాము. ఒక రిపోర్ట్స్ విషయానికి వస్తే, 5 గంటల 20 నిమిషాల సమయంలో చాట్ జిపిటి సర్వీస్ లో అంతరాయం కలుగుతున్నట్లు కొందరు యూజర్లు సోషల్ మీడియా ద్వారా రిపోర్ట్ చేసారు. అంతేకాదు, ప్రముఖ రిపోర్టింగ్ ప్లాట్ ఫామ్ డౌన్ డిక్టేటర్ ద్వారా కూడా రిపోర్ట్ చేసినట్లు మేము గమనించాము. ఇందులో రిపోర్ట్ చేసిన వారిలో 83 శాతం మంది చాట్ జిపిటి లో సమస్య చూసినట్లు తెలిపారు. చాట్ జిపిటి లో చాట్ ఇమేజ్ క్రియేట్ వీక్ చేయడం వంటి పనులు చేయడానికి ఆటంకం కలిగింది. అంతేకాదు, కొందరు లాగిన్ లో సమస్య చూసినట్లు కూడా చెబుతున్నారు. అయితే, ఇది వెబ్ పేజీ లో ఎక్కువ ఉన్నట్లు తెలిపారు. యాప్ లో 8% మరియు Codex లో 5 % సర్వీస్ లోపం ఉన్నట్లు రిపోర్ట్ చేశారు. చాట్ జిపిటి లో డౌన్ కావడానికి తగిన రీజన్ గురించి కంపెనీ ఇంకా అఫీషియల్ గా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయితే, ఈ ఈ సర్వీస్ అంతరాయం ఎక్కువ సమయం నిలిచి ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది రెగ్యులర్ గా వచ్చే సర్వీస్ లోపం కావచ్చని కూడా చెబుతన్నారు.
0 Comments