Ad Code

18 మంది పాకిస్తానీ ఉద్యోగుల్ని తీసేసిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ : 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆదేశం


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని  ఎతిహాద్ ఎయిర్‌వేస్ లో  పనిచేస్తున్న 18 మంది పాకిస్తానీ ఉద్యోగుల్ని తీసేసింది. ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఉద్యోగం కోల్పోయినవారిలో ఒకరు ఆ సంస్థలో 18 ఏళ్లుగా పనిచేస్తుండటం గమనార్హం. వీరిని ఉద్యోగం నుంచి తీసేసిన తర్వాత, ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద రిపోర్ట్ చేయమని చెప్పడం కొసమెరుపు. సాధారణంగా ఉద్యోగం నుంచి తీసేసిన సంస్థ, ఇమ్మిగ్రేషన్ అధికారుల ముందు రిపోర్టు ఎందుకు చేయమంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎలాంటి నోటీసులు లేకుండా రెండు రోజుల్లో పాకిస్తాన్ తిరిగి వెళ్లాలని ఆదేశించడంతో, ఇంత తక్కువ వ్యవధిలో వెళ్లిపోవడం కష్టంగా మారిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఆ దేశ ప్రజలు యూఏఈ నుంచి పంపించే డబ్బులు చాలా కీలకం. ఇదే కాకుండా చాలా మంది పాకిస్తానీలు యూఏఈలో ఉపాధి పొందుతారు. ఈ నేపథ్యంలో ఇలా ఉద్యోగాలను తీసేసయడం పాకిస్తాన్‌కు భారీ దెబ్బగా చెబుతున్నారు. ఈ తొలగింపులపై ఇప్పటి వరకు ఎతిహాద్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇటీవల, ఇరాన్ పరిణామాలు, సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య ఒప్పందం యూఏఈకి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల యూఏఈ తనకు పాకిస్తాన్ నుంచి రావాల్సిన 3 బిలియన్ డాలర్లను వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఇరాన్ తమపై దాడులు చేస్తున్నా సౌదీ, పాకిస్తాన్‌లు కనీసం ఖండించలేదనే ఆగ్రహం యూఏఈలో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu