అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో భారీ డిస్కౌంట్‌ ఆఫర్ !


మెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. గూగుల్ సొంతంగా తయారు చేసిన టెన్సర్ చిప్‌సెట్, అద్భుతమైన ఫోటోగ్రఫీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రత్యేకం. గత ఏడాది విడుదలైనప్పటికీ, ఇప్పటికీ ఇది మార్కెట్లో అత్యంత శక్తివంతమైన మొబైల్స్‌లో ఒకటిగా కొనసాగుతోంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ప్రారంభంలో రూ. 1,09,999 ధరకు విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ సైట్‌లో దీనిపై రూ. 23,500 భారీ తగ్గింపు లభిస్తోంది. దీనివల్ల ఫోన్ ధర రూ. 86,499కి దిగి వచ్చింది. దీనికి తోడు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3,250 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు రూ. 3,000 వరకు వెసులుబాటు ఉంది. ఈ బ్యాంక్ ఆఫర్లన్నీ వర్తింపజేస్తే రూ. 83,249కే ఈ ప్రీమియం ఫోన్ మీ సొంతం అవుతుంది. పాత ఫోన్ మార్పిడి చేసుకునే వారికి మరింత తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది. ఇందులో 6.3 అంగుళాల ఎల్‌టీపీఓ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తూ సున్నితమైన అనుభూతిని ఇస్తుంది. గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 వాడారు. పనితీరు పరంగా టెన్సర్ G4 చిప్‌సెట్, 16GB భారీ ర్యామ్ ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ చాలా వేగంగా జరుగుతుంది. 256GB అంతర్గత స్టోరేజ్ వల్ల ఫోటోలు, వీడియోలు దాచుకోవడానికి కావాల్సినంత స్థలం లభిస్తుంది. వెనుక వైపు 50MP ప్రధాన కెమెరాతో పాటు, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 48MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ టెలిఫోటో లెన్స్ ద్వారా 5x ఆప్టికల్ జూమ్, 30x వరకు సూపర్ రెస్ జూమ్ చేయవచ్చు. సుదూర వస్తువులను కూడా ఎంతో స్పష్టంగా ఫోటో తీయవచ్చు. సెల్ఫీల కోసం 42MP కెమెరాను కేటాయించారు. ఇది 8K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేయడం వల్ల ప్రొఫెషనల్ వీడియోలు తీసుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గూగుల్ ఏఐ ఫీచర్లు ఫోటోలను మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. 4,700mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఒక రోజంతా ప్రశాంతంగా ఫోన్ వాడుకోవడానికి సరిపోతుంది. నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్‌లలో సినిమా చూడటానికి దీని డిస్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. గూగుల్ నుండి నేరుగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ లభిస్తాయి. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం