హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరిగిన తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షులుగా వీఎన్ ఆదిత్య ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా సముద్ర ఎంపిక కాగా, ప్రధాన కార్యదర్శిగా రామారావు, ట్రెజరర్‌గా దర్శకుడు సాయి రాజేశ్ గెలిచారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వి ఎన్ ఆదిత్య మాట్లాడుతూ డైరెక్టర్స్ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. మేము చేసిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తామని, అసోసియేషన్ సభ్యులకు ఆరోగ్య భద్రత, సినిమా నిర్మాణంలో సహాయం చేస్తామని వెల్లడించారు. మా ప్యానెల్‌లో 18మంది పోటి చేస్తే 16 మంది గెలిచారని అన్నారు. రు.
0 Comments