తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా భద్రత పథకాన్ని ప్రవేశ పెట్టిన ఎస్బీఐ


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ ప్రీమియంతో ఎక్కువ భద్రత కల్పించాలనే లక్ష్యంతో కొత్త భీమా పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ బీమా పథకంలో చేరేందుకు ఖాతాదారులు సంవత్సరానికి రూ.3,000 ప్రీమియం చెల్లించాలి. ఒకసారి అంగీకారపత్రం ఇచ్చి, ఖాతా నుంచి ప్రీమియం కట్ చేసేందుకు అనుమతి ఇస్తే, ప్రతి సంవత్సరం ఆటోమేటిక్‌గా పునరుద్ధరణ సౌకర్యం ఉంటుంది. దీంతో ప్రతి ఏడాది మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. బీమా పొందిన వ్యక్తి రోడ్డు ప్రమాదం, ప్రకృతి విపత్తులు (వరదలు, భూకంపాలు మొదలైనవి), పాముకాటు వంటి అనుకోని ప్రమాదాల వల్ల మరణిస్తే, నామినీకి రూ.60 లక్షల వరకు పరిహారం అందుతుంది. మరణ ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌లో సమర్పించాలి. అన్ని విధానాలు పూర్తయ్యాక పరిహారం నామినీ ఖాతాలో జమ అవుతుంది. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కొన్ని అదనపు సౌకర్యాలు కూడా ఉన్నాయి. కుటుంబ యజమాని మరణిస్తే ఇద్దరు పిల్లల చదువులకు రూ.20,000 వరకు సహాయం, అంత్యక్రియల ఖర్చులకు రూ.10,000, అంబులెన్స్‌ ఖర్చులకు రూ.1,500 బీమా మొత్తానికి అదనంగా చెల్లించబడతాయి. ఆత్మహత్య, మాదకద్రవ్యాల వినియోగం వల్ల మరణం లేదా ఇతర సహజ వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలకు ఈ ప్రమాద బీమా వర్తించదు. కాబట్టి పాలసీ నిబంధనలను ముందుగా పూర్తిగా తెలుసుకోవడం అవసరం. తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తంలో ప్రమాద బీమా భద్రత పొందాలని భావించే ఖాతాదారులకు ఈ పథకం ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. 

Post a Comment

Previous Post Next Post
3