Ad Code

ఐబొమ్మ రవికి హైకోర్టు బెయిల్ మంజూరు


బొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేశంలోని అతిపెద్ద సినిమా పైరసీ నెట్‌వర్క్‌లలో ఒకదాన్ని నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు రవిని నవంబర్ 15వ తేదీన అరెస్టు చేశారు. అధికారుల ప్రకారం ఈ నెట్‌వర్క్ ద్వారా వేల సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను ఐబొమ్మలో అప్‌లోడ్ చేశాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రొత్సహించాడు. తాజాగా రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దేశం విడిచి వెళ్లకూడదని, ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు పాస్ పోర్టును కోర్టులో సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇంటర్నెట్ ఉపయోగించకూడదని, ఒకవేళ నెట్ వాడాలి అనుకుంటే.. పోలీసుల అనుమతి తీసుకోవాలని వెల్లడించింది. ఐబొమ్మ రవిని మీద దాదాపు ఐదు కేసులు ఉన్నాయి. సినిమాల పైరసీతోపాటుగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి అతడిపై కేసులు నమోదు అయ్యాయి. గతంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా నాంపల్లి కోర్టు కొట్టివేసింది. చాలా సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. తాజాగా ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్ దొరికింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Post a Comment

0 Comments

Close Menu