సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల వారణాసి చిత్ర ప్రచార కార్యక్రమంలో.. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమౌళిపై కేసు నమోదు చేసి.. భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు పోలీసులను కోరారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు. ఆ అసహనం హనుమంతుడిపై వ్యక్తం చేయడంతో అంజన్న భక్తులు రాజమౌళిపై మండిపడుతున్నారు. తనకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదని, తన తండ్రి మాట్లాడుతూ హనుమ వెనకాల ఉంటాడని, గుండె తట్టి నడిపిస్తాడని చెప్పారని.. తనకు వెంటనే కోపమొచ్చిందని.. ఇదేనా నడిపించేదని రాజమౌళి వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై హనుమాన్ భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. మానవ తప్పిదాలకు దేవుడిని నిందించడం ఏంటని రాజమౌళిని నిలదీశారు.
సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు !
November 18, 2025
0
Tags