రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 'నెక్స్ట్ జెన్' మోడల్ !


రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తున్న బుల్లెట్ 350 నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ ఆగస్టు 30 మార్కెట్‌లోకి రానుంది. 1932 నుంచి నిరంతర ఉత్పత్తిలో ఉన్న బుల్లెట్ 350.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి చెందిన పురాతన మోడల్. బుల్లెట్ 350 నెక్స్ట్ జనరేషన్ మోడల్‌కి చెందిన ఫోటోలు అధికారిక లాంచ్ కంటే ముందే లీక్ అయ్యాయి. వాటిని చూస్తే బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పు ఉండదని తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన క్లాసిక్ 350లో ఉన్నట్లుగానే.. బుల్లెట్ 350 నెక్స్ట్ జనరేషన్లో కూడా టైల్‌లైట్, క్రోమ్ బెజెల్‌తో కూడిన ఫ్లాట్ రౌండ్ హెడ్‌ల్యాంప్‌ ఉండవచ్చు. బుల్లెట్ 250 నెక్స్ట్ జనరేషన్ .. 346 cc UCE ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది. ఇందులో కొత్త J సిరీస్ ఇంజన్, 349 cc సింగిల్ సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంటాయి. ధర రూ. 1 లక్షా 70 వేల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 1 లక్షా 90 వేల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాల అంచనా. https://t.me/offerbazaramzon

Post a Comment

Previous Post Next Post
3