Ad Code

రెడ్ మీ 17 5జీ మోడల్‌ను లాంచ్ చేసిన షావోమీ

దేశీయ మార్కెట్‌లో షావోమీ లేటెస్ట్ గా రెడ్ మీ 17 5జీ మోడల్‌ను లాంచ్ చేసింది. శక్తివంతమైన బ్యాటరీ,పెద్ద డిస్‌ప్లే, స్మార్ట్ పెర్ఫార్మన్ తోపాటు రోజువారీ ఉపయోగంలో ఎక్కువ సమయం పాటు కనెక్టివిటీని కొనసాగించాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది. ఆధునిక డిజైన్, సౌకర్యవంతమైన యూజర్ అనుభవం అందిస్తుంది.రెడ్ మీ17 5G స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అంచనాలను అందుకొంటూ కొత్త తరహా మొబైల్ అనుభవాన్ని అందించనుంది. 6.9 అంగుళాల IPS LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్ , వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని అత్యంత ఈజీ గా అందిస్తుంది . Snapdragon 4 Gen 5 ప్రాసెసర్ తో పని చేసే ఈ ఫోన్ వేగవంతమైన పెర్ఫార్మన్స్ , 5G కనెక్టివిటీని అందిస్తుంది. కెమెరా సెగ్మెంట్లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా , 8MP ఫ్రంట్ కెమెరా తో ఫోటోగ్రఫీ, వీడియో కాలింగ్, సోషల్ మీడియా వినియోగం బెస్ట్ గా ఉంటుంది. 7,900mAh బ్యాటరీ లాంగ్ రన్ వినియోగాన్ని అందిస్తూ 45W టర్బో ఛార్జింగ్ , 22.5W రివర్స్ ఛార్జింగ్ తో వినియోగదారులకు అదనపు ప్రయోజనం అందిస్తుంది . HyperOS 3 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను సులభతరం చేస్తుంది.స్టోరేజ్ పరంగా 6GB/8GB RAM ,128GB ఇంటర్నల్ మెమరీతో పాటు 2TB వరకు ఎక్స్‌పాండబుల్ ఆప్షన్ అందుబాటులో ఉంది. IP64 రేటింగ్‌తో నీటి , ధూళి ప్రొటెక్షన్ , సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, AI ఫేస్ అన్‌లాక్ వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది . కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi, Bluetooth 5.1, FM Radio, USB Type-C వంటి ఆప్షన్లు ఉన్నాయి. Absolute Black, Endless Blue, Eternal Orange అనే మూడు రంగులలో అందుబాటులో ఆకర్షణీయంగా ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu