తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ వేయగా అది తిరస్కరణకు గురైంది. నామినేషన్ పత్రాలతో సమర్పించిన అఫిడవిట్‌లో ఒక పెండింగ్ కేసుకు సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నామినేషన్ల పరిశీలన సమయంలో బీజేపీ నాయకులు రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఒక కోర్టు కేసు వివరాలను మీనాక్షి నటరాజన్ తన అఫిడవిట్‌లో పేర్కొనలేదని బీజేపీ ఆరోపించింది. ఈ అభ్యంతరాన్ని పరిశీలించిన అనంతరం నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మీనాక్షి నటరాజన్ గతంలో లోక్‌సభ సభ్యురాలిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు
0 Comments