Ad Code

2026 చివరి నాటికి మార్కెట్లోకి వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్ ?


న్‌ప్లస్ 16 గురించి వస్తున్న లీకులు టెక్ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వన్‌ప్లస్ 16 కేవలం వేగంగా ఉండటమే కాకుండా, మునుపెన్నడూ లేని విధంగా అత్యున్నత పనితీరును ప్రదర్శించనుంది. ఇందులో క్వాల్కమ్ నుంచి రాబోతున్న అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 6 Pro చిప్‌సెట్‌ను వాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాసెసర్ వేగం ఏకంగా 5GHz వరకు ఉంటుందని సమాచారం. ఇది స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన చిప్‌సెట్‌లలో ఒకటిగా నిలవడమే కాకుండా గేమింగ్ , మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. డిస్‌ప్లే విభాగంలో కూడా వన్‌ప్లస్ విప్లవాత్మక మార్పులు చేస్తోంది. ఇందులో BOE ప్యానెల్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లే ఉండనుంది. ఈ స్క్రీన్ 240Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేసే అవకాశం ఉందని, LTPO , LIPO ప్యాకేజింగ్ టెక్నాలజీల వాడకం వల్ల ఫోన్ చుట్టూ ఉండే బెజెల్స్ కేవలం 1mm కి తగ్గిపోతాయని నివేదికలు తెలుపుతున్నాయి. దీనివల్ల వినియోగదారులకు అంచుల్లేని అద్భుతమైన విజువల్ అనుభూతి కలుగుతుంది. ఇందులో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ప్రధాన ఆకర్షణగా నిలపబోతున్నారు. ఈ సెన్సార్ పరిమాణం కూడా చాలా పెద్దదిగా (1/1.x-inch) ఉండే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. దీనికి తోడుగా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా , మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ ఉండబోతున్నాయి. ఈ కాంబినేషన్ ద్వారా అత్యంత స్పష్టమైన జూమింగ్ , లో-లైట్ ఫోటోగ్రఫీ సాధ్యమవుతుంది. ఈ ఫోన్‌లో 9,000mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అమర్చబోతున్నట్లు లీకులు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఉండే బ్యాటరీల కంటే ఇది దాదాపు రెట్టింపు సామర్థ్యం కావడం గమనార్హం. దీనివల్ల ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రోజులకు తరబడి బ్యాటరీ లైఫ్ వచ్చే అవకాశం ఉంది, ఇది హెవీ యూజర్లకు ఒక గొప్ప వరంగా మారుతుంది. హార్డ్‌వేర్ పరంగానే కాకుండా సాఫ్ట్‌వేర్ , AI పరంగా కూడా అడ్వాన్స్‌డ్ గా ఉండబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక AI బటన్ను కూడా కేటాయించినట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 17 ఆధారిత OxygenOS 17 సాఫ్ట్‌వేర్‌తో రాబోతున్న ఈ ఫోన్‌లో హ్యాప్టిక్స్ కోసం X-axis మోటార్, సిమ్మెట్రికల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు , పూర్తిస్థాయి వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అయితే వన్‌ప్లస్ 15 తరహాలోనే ఈ కొత్త ఫోన్ కూడా 2026 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu