Ad Code

టెస్ట్‌ డ్రైవ్‌ పేరుతో బెంజ్‌ కారుతో జంప్‌ !


హైదరాబాద్ లో టెస్ట్‌ డ్రైవ్‌ పేరుతో తీసుకెళ్లిన విలాసవంతమైన కారును తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఘటనపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు 2024 డిసెంబర్‌ 16న అక్బర్‌ఖాన్‌ అనే వ్యక్తి సయ్యద్‌ అషా్ఫక్‌ అహ్మద్‌(66)కు చెందిన మెర్సిడెస్‌బెంజ్‌ జీఎల్‌ఏ 200డి (టీఎస్‌ 09 ఈఎక్స్‌ 8199) కారును టెస్ట్‌ డ్రైవ్‌ కోసం తీసుకువెళ్లాడు. అనంతరం కారును తిరిగి ఇవ్వకపోగా మహమ్మద్‌ సఫీర్‌ అహ్మద్, కార్స్‌ గలోర్‌లతో కలిసి అక్బర్‌ఖాన్‌ ఆ కారును విక్రయించాడు. అయితే ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రూ. 25 లక్షల్లో కేవలం రూ. 2.50 లక్షలు మాత్రమే చెల్లించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో పాటు కారును కూడా తిరిగి ఇవ్వలేదు. పైగా సయ్యద్‌ అషా్ఫక్‌ అహ్మద్‌ను బెదిరించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu