Ad Code

నియోపోలిస్ లో భారీ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ది క్యాస్కేడ్


హైదరాబాద్ నగరం నియోపోలిస్ లో భారీ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ది క్యాస్కేడ్ పేరుతో నిర్మిస్తున్నారు. ఇది నగరం గగనతలాన్ని తాకేలా అత్యంత ఎత్తైన భవనాల్లో ఒకటిగా నిలవనుంది. సుమారు రూ. 3,169 కోట్ల భారీ పెట్టుబడితో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, గ్లోబల్ స్టాండర్డ్స్‌కు నిలువుటద్దంగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 భారీ టవర్లను నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ 63 అంతస్తుల ఎత్తుతో, దాదాపు 217 మీటర్లపొడవుతో నగరంలోనే సరికొత్త రికార్డును సృష్టించబోతున్నాయి. ఆధునిక వాస్తుశిల్ప శైలితో, ప్రకృతి ఒడిలో విలాసవంతమైన జీవనశైలిని అందించడమే లక్ష్యంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. నియోపోలిస్ ప్రాంతం ఇప్పటికే ఐటీ , ఫైనాన్షియల్ హబ్‌లకు కేంద్రంగా మారడంతో, ఈ ప్రాజెక్ట్ హై-నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ , సాఫ్ట్‌వేర్ నిపుణులను విశేషంగా ఆకర్షిస్తోంది. మౌలిక సదుపాయాల పరంగా ఈ ప్రాజెక్ట్ అత్యంత వ్యూహాత్మకమైన ప్రదేశంలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన రవాణా సౌకర్యం ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్రధాన బలాలు. అంతేకాకుండా, 217 మీటర్ల ఎత్తు నుంచి నగరం , గండీపేట్ చెరువు అందాలను వీక్షించేలా ఈ టవర్లను డిజైన్ చేయడం ఇన్వెస్టర్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అత్యాధునిక క్లబ్ హౌస్, గ్రీన్ జోన్లు, స్మార్ట్ హోమ్ ఫీచర్లతో కూడిన ఈ అపార్ట్‌మెంట్లు లగ్జరీ విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పనున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu