జూబ్లీహిల్స్‌ మంగళగౌరి షోరూంలో భారీ అగ్ని ప్రమాదం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 36లోని మంగళగౌరి షోరూంలో మంటలు చెలరేగాయి. అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పాటు ఈ ప్రాంతమంతా భారీగా పొగలు వ్యాపించాయి. పక్క భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. వెంటనే అప్రమత్తం అయిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే పనిలో నిమగ్నమయ్యారు. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. షాప్ ముందు ఏర్పాటు చేసిన టెంపుల్ సెట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అంటుకోవడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఉదయం షోరూం తెరుస్తున్న సమయంలో నిప్పు రవ్వలు చెలరేగి టెంపుల్ సెట్ అంటుకున్నట్లు సమాచారం అందుతోంది. టెంపుల్ సెట్ పూర్తిగా కాలిపోగా ఇప్పటికే షోరూంలోకి సైతం మంటలు వ్యాపించాయి. లోపల ఉన్న దుస్తులు అన్నీ కాలిపోయాయి.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default