Ad Code

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు : విజయ్ కు తమిళనాడు గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం


మిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఇదివరకే తమిళనాడు కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నప్పటికీ బుధవారం మధ్యాహ్నం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు జోసెఫ్ విజయ్, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని కోరారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ శాసనసభ పక్షం కలిసి టీవీకేతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు టీవీకే అధినేత విజయ్ కు తమిళనాడు గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు. ‘భారత రాజ్యాంగంపై నమ్మకం లేని మతతత్వ శక్తులను ఈ కూటమికి దూరంగా ఉంచాలనే నిబంధనతో మద్దతు ఇస్తున్నాం. టీవీకే, తమిళనాడు కాంగ్రెస్ మధ్య ఏర్పడిన ఈ కూటమి, పెరుంతలైవర్ కామరాజ్ తమిళనాడు స్వర్ణయుగాన్ని మళ్లీ తీసుకురావడానికి కృషి చేస్తుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో తందై పెరియార్ సామాజిక న్యాయ సూత్రాలకు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ విలువలకు మేం కట్టుబడి ఉంటామని’ కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu