Ad Code

ఆస్కార్ అవార్డు గ్రహీత బ్రెండా ఫ్రికర్ కన్నుమూత

హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుత నటనతో చెరగని ముద్ర వేసిన లెజెండరీ నటి, ఆస్కార్ అవార్డు గ్రహీత బ్రెండా ఫ్రికర్ (81) వృద్ధాప్య సమస్యలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగరంలో తుది శ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. బ్రెండా ఫ్రికర్ మరణవార్త వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక అద్భుతమైన నటీమణిని కోల్పోయామంటూ సోషల్ మీడియా వేదికగా హాలీవుడ్ అంతటా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డును అందుకున్న మొట్టమొదటి ఐరిష్ నటిగా బ్రెండా ఫ్రికర్ చరిత్ర సృష్టించారు. 1989లో విడుదలైన క్లాసిక్ డ్రామా ‘మై లెఫ్ట్ ఫుట్’ సినిమాలో ఆమె కనబరిచిన అద్భుత నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అవార్డు వరించింది. కేవలం ఈ సినిమానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించిన ‘హోమ్ అలోన్ 2: లాస్ట్ ఇన్ న్యూయార్క్’ లో ఆమె పోషించిన పీజియన్ లేడీ (పావురాల మహిళ) పాత్ర, బ్రిటీష్ మెడికల్ డ్రామా సిరీస్ ‘కాజువాలిటీ’ ఆమెకు గ్లోబల్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి. తన సుదీర్ఘ కెరీర్‌లో 50కి పైగా చలనచిత్రాలు, విభిన్నమైన టెలివిజన్ సిరీస్‌లలో నటించిన బ్రెండా, నటనపై ఆసక్తి ఉన్న ఎందరో యువ నటీనటులకు రోల్ మోడల్‌గా నిలిచారు.

Post a Comment

0 Comments

Close Menu