ఆగస్టు 29న అధునాతన ఫీచర్లతో ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ

థర్ ఎనర్జీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆగస్టు 29న అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ అభివృద్ధి చేసిన కొత్త EL ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందిన తొలి ప్రొడక్షన్ స్కూటర్ ఇదే కావడం విశేషం. ఇటీవల ఈ స్కూటర్ టెస్టింగ్ సమయంలో రోడ్లపై కనిపించడంతో దీనిపై ఆసక్తి మరింత పెరిగింది. టెస్టింగ్ సందర్భంగా కనిపించిన ఈ స్కూటర్ డిజైన్ 2025లో కంపెనీ ప్రదర్శించిన EL01 కాన్సెప్ట్‌ను పోలి ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో దీనికి సంబంధించిన డిజైన్ పేటెంట్ కూడా దాఖలైంది. స్పై చిత్రాల ప్రకారం..స్కూటర్‌లో హ్యాండిల్‌బార్‌పై అమర్చిన హెడ్‌లైట్, ముందు భాగంలో వైడ్ LED DRL (డే టైమ్ రన్నింగ్ లైట్) వంటి ఆధునిక డిజైన్ ఎలిమెంట్స్ కనిపించనున్నాయి. ఏథర్ 450 సిరీస్ తర్వాత కంపెనీ అభివృద్ధి చేసిన మొదటి పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ EL ప్లాట్‌ఫామ్. భవిష్యత్తులో ఏథర్ విడుదల చేసే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లన్నీ ఈ ప్లాట్‌ఫామ్‌పైనే తయారయ్యే అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై రూపొందే స్కూటర్ ధర రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షల మధ్య ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఏథర్ ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఏథర్ తన 450X, 450 అపెక్స్ మోడళ్ల కోసం ఇన్ఫినిట్ క్రూజ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. జనవరి 2025 నుంచి విడుదలైన పాత 450X, 450 అపెక్స్ మోడళ్లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. 

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains