టీవీకేకు సీవీకే, వామపక్షాల మద్దతు : గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కోరిన విజయ్‌

Friday, May 8, 2026

CVK and Left Parties Extend Support to TVK he has secured the "magic number" of 118 seats required to form a government Tamil Nadu Vijay Seeks Appointment with Governor

t f B! P L


తమిళనాడులో విజయ్‌ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్‌తోపాటు సీవీకే, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ నంబర్‌ 118ను ఆయన సాధించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌ సిద్ధమవుతున్నారు. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 108 స్థానాల్లో టీవీకే గెలిచింది. తొలుత తన ఐదుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. చెరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న సీపీఐ, సీపీఐ (ఎం)లు కూడా అంతర్గత సమావేశాల తర్వాత టీవీకేకు శుక్రవారం మద్దతు తెలిపాయి. ఇద్దరు ఎమ్మెల్యేలున్న విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) కూడా విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 మెజారిటీ మార్కు టీవీకేకు లభించింది. కాగా, కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎం) మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌ సన్నద్ధమయ్యారు. ఈ పార్టీల మద్దతు లేఖలతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారు. దీనికి గవర్నర్‌ సమ్మతిస్తే ప్రభుత్వం ఏర్పాటుపై విజయ్‌ దృష్టిసారిస్తారు. దీంతో తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడనున్నది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ