బ్లాక్ కాఫీ - ఆరోగ్య ప్రయోజనాలు

Wednesday, February 25, 2026

arogyam Black Coffee - Health Benefits does not contain calories drink coffee food happy hormones like 'dopamine' and 'serotonin' are released in our brain

t f B! P L


బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. బ్లాక్ కాఫీలో కేలరీలు ఉండవు. ఇది శరీరంలోని జీవక్రియను వేగవంతం చేస్తుంది, దీనివల్ల ఒంట్లో ఉన్న అనవసరమైన కొవ్వు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాఫీ తాగగానే మన మెదడులో 'డోపమైన్', 'సెరోటోనిన్' వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల మూడ్ వెంటనే మారిపోయి, మనసు ప్రశాంతంగా, ఉత్సాహంగా మారుతుంది. దీంతో ఏకాగ్రత కూడా పెరుగుతుందంటున్నారు. బాగా అలసిపోయినట్లు ఉన్నప్పుడు లేదా బద్ధకంగా అనిపించినప్పుడు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగి చూడండి. ఇందులో ఉండే కెఫిన్ మీకు వెంటనే శక్తిని ఇచ్చి, అలసటను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ మితంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం దాదాపు 7% వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. మనం తినే ఆహారంలోని వ్యర్థాలను శుద్ధి చేసే కాలేయం ఆరోగ్యానికి బ్లాక్ కాఫీ చాలా మంచిదని అంటున్నారు. ఇది కాలేయంలో అనవసరమైన కొవ్వు చేరకుండా చూస్తుందని, అలాగే కాలేయానికి సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుతుందని చెబుతున్నారు. అయితే బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అతిగా తాగకూడదని సూచిస్తున్నారు. రోజుకు 2 నుంచి 3 కప్పులు తాగితే సరిపోతుందని, రాత్రి పడుకునే ముందు తాగకూడదని చెప్పారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ