Ad Code

డోన్ హైవేపై కారును వెనుక నుంచి ఢీకొట్టిన క్రేన్ : ఇద్దరు చిన్నారులతో సహా మహిళ దుర్మరణం


ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా డోన్ హైవే పై కారును వెనుక నుంచి క్రేన్ ఢీకొట్టడంతో మహిళ సహా ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని  మృతులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్య ఫలితమేనని జిల్లా ఎస్పీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఎవరి ప్రాణాలు కోల్పోకుండా సురక్షితంగా గమ్యం చేరడమే లక్ష్యంగా ఇకనైనా ప్రజలు మారాలని కోరారు. భారతదేశంలో ప్రతిరోజు సగటున సుమారు 450 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, గత సంవత్సరం దేశవ్యాప్తంగా 1.6 లక్షల మంది మృతి చెందారని, సుమారు 3 లక్షల మంది గాయపడ్డారని తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu