ఆంధ్రప్రదేశ్ లో మార్చిలో 8,977 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మార్చి 1న ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28నే పెన్షన్లు అందజేయనున్నట్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62.76 లక్షల మందికి రూ.2,725 కోట్లను పంపిణీ చేయనున్నట్టు పేర్కొంది. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, మంచానికే పరిమితమయిన వారికి రూ.15 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28న పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. మరోవైపు 28న పెన్షన్లు అందుకోని వారికి మార్చి 2న ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 28న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని రావివలస గ్రామంలో అర్హులైన వృద్ధులకు మరియు ఇతరులకు సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తారని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ తెలిపారు.
0 Comments