Ad Code

మిడిల్ క్లాస్ కు బెస్ట్ ఆప్షన్ టాటా టియాగో ఈవీ


టాటా కంపెనీ తాజాగా టియాగో ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే దీనికి మరింతగా మెరుగులు దిద్ది ఫేస్ లిఫ్ట్ గా రాబోతుంది. ఇందులో ప్రధానంగా ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్, స్టీరింగ్ ఆడియో, టచ్ స్క్రీన్ ఇంపార్టైన్మెంట్ సిస్టం, సన్ రూప్ వంటి సదుపాయాలు ఇందులో కనిపిస్తాయి. వీటిలో సన్రూఫ్ ప్రీమియం కార్లలో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా దీనిలో ప్రవేశపెట్టారు. సేఫ్టీ లోను టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ కారు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి. డిజైన్ పరంగా కూడా ఆకట్టుకునే విధంగా ఉండనుంది. ఇందులో ఎల్ ఈ డి లైట్స్, రీ డిజైన్ చేసిన బంపర్లు కారుకు అందాన్ని తీసుకువచ్చాయి. ఈ కారులో రెండు రకాల బ్యాటరీలు చూడవచ్చు. ఇప్పటివరకు టాటా టియాగో టీవీలో 19.2 kWh, 24 kWh అనే రెండు బ్యాటరీలు ఉన్నాయి. కొత్తగా వచ్చే ఫేస్ లిఫ్టులో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బ్యాటరీలు సింగిల్ ఛార్జింగ్ పై 300 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రీమియం కార్ల ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ధర మాత్రం తక్కువగానే నిర్ణయించారు. టాటా టియాగో ఇవి రూ.7.99 లక్షలు ఉండగా.. ఫేస్ లిఫ్ట్ కూడా అంతే ధరలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ ధరలు కూడా తగ్గించారు.. వాటికి పోటీగా దీనిని మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారు కొనుగోలు చేసేటప్పుడు బాటరీ యాజ్ ఏ సర్వీస్ ఆప్షన్ ఉంటే తక్కువ ధరతోనే కారును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu