మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా షెగావ్ పట్టణం విశావా గ్రౌండ్, భక్తినివాస్ కాంప్లెక్స్‌లో జాతీయ ఆరోగ్య మేళా 2026 మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, అఖిల్ భారతీయ ఆయుర్వేద మహాసమ్మేళన సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేళాకు ప్రఖ్యాత ఆయుర్వేద సంస్థలు బైద్యనాథ్, సిద్ధాయి ప్రధాన ప్రాయోజకులుగా వ్యవహరించాయి. తమ స్టాళ్లలో విస్తృత శ్రేణి ఆయుర్వేద ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు, ఆయుర్వేదంపై అవగాహన కల్పించే పుస్తకాలను రాయితీ ధరలకు అందుబాటులో ఉంచాయి. ఈ మేళా ఆయుర్వేద ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేయడంలో కీలకంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
0 Comments