Ad Code

ఆంధ్రప్రదేశ్‌లో రేపు పలు జిల్లాల్లో వర్షాలు


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో అకాల వర్షాలు, వడగండ్లకు కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. రేపు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండకుండా చూసుకోవాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది..

Post a Comment

0 Comments

Close Menu