సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటిన ప్రపంచపు తొలి రాజకీయ నాయకుడిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుత కాలంలో ప్రజల్లో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి వేదికల ద్వారా వారు పంచుకునే అభిప్రాయాలు ప్రజల్లోకి వేగంగా చేరుతున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో ఎంతో చురుగ్గా ఉంటూ తన సందేశాలను పంచుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్ల మైలురాయిని దాటింది. అంటే 10 కోట్ల మందికి పైగా ఆయనను ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరే ఇతర రాజకీయ నేతకు ఇన్ని కోట్ల మంది ఫాలోవర్లు లేకపోవడం గమనార్హం.
0 Comments