మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్‌కు రావాలని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షాను విజయ్, రష్మిక ఆహ్వానించారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నూతన దంపతులు కలిసి అహ్వానం అందించారు. ఇప్పటికే వారిద్దరికీ శుభాంకాంక్షలు చెబుతూ మోడీ ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ జరగునుంది. ఈ రిసెప్షన్ కోసం ఇప్పటికే పలువురు రాజకీయ సినీ వ్యాపారవేత్తలను విజయ్, రష్మిక ఆహ్వానించారు. 'గీత గోవిందం' సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ - రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి ఇప్పుడు భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు.
0 Comments