భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వినియోగదారుల సౌకర్యార్థం ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ కేంద్రాల వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. గూగుల్ మ్యాప్స్‌లో కేవలం కేంద్రం చిరునామా మాత్రమే కాకుండా, అక్కడ లభించే సేవల వివరాలను కూడా పొందుపరచనున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు సమయం వృథా కాకుండా ఉంటుంది. కొత్తగా ఆధార్ తీసుకోవాలనుకునే పెద్దలు, చిన్నారుల కోసం ఎన్‌రోల్‌మెంట్ సౌకర్యం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. చిరునామా, మొబైల్ నంబర్ మార్పు వంటి సేవలు ఏయే కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయో ముందే చూసుకోవచ్చు.ఏ కేంద్రం ఏ సమయంలో పనిచేస్తుంది, సెలవు దినాలు ఎప్పుడనేది కూడా స్పష్టంగా ఉంటుంది. కేంద్రాల భౌతిక స్థితిగతులపై కూడా ఉడాయ్ దృష్టి సారించింది. ఆధార్ కేంద్రం వద్ద దివ్యాంగులకు అనువైన సదుపాయాలు ఉన్నాయా? వాహనాల కోసం పార్కింగ్ సదుపాయం ఉందా? అనే కీలక సమాచారాన్ని కూడా గూగుల్ మ్యాప్స్‌లో పొందుపరుస్తున్నట్లు ఉడాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు తమకు అనువైన కేంద్రాన్ని సులువుగా ఎంచుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చాలాచోట్ల అనధికారిక లేదా మూతపడిన ఆధార్ కేంద్రాల వివరాలు కనిపిస్తుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొత్త విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 60 వేల అధీకృత కేంద్రాల ఖచ్చితమైన సమాచారాన్ని నేరుగా గూగుల్ మ్యాప్స్‌లో చూసుకోవచ్చని ఉడాయ్ సీఈఓ భువనేశ్ కుమార్ పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని నివారించి, పారదర్శకతను పెంచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. కొన్ని నెలల్లోనే ఈ సేవలు గూగుల్ మ్యాప్స్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. అంతటితో ఆగకుండా, భవిష్యత్తులో గూగుల్ మ్యాప్స్ ద్వారానే నేరుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించే దిశగా ఉడాయ్ అడుగులు వేస్తోంది దీనివల్ల కేంద్రాల వద్ద క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా, నిర్ణీత సమయంలో వెళ్లి పని పూర్తి చేసుకోవచ్చు. డిజిటల్ ఇండియా దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఆధార్ సేవలను గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానించడం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ సేవలు !
by Telugu Lo Computer at February 27, 2026
Labels:
Aadhaar services on Google Maps
,
national
,
technology
,
Unique Identification Authority of India has joined hands with the leading search engine giant Google
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment