Ad Code

మార్చి 17న మార్కెట్లోకి రానున్న రెనాల్ట్ కొత్త డస్టర్


మార్చి 17న రెనాల్ట్ కొత్త డస్టర్ మార్కెట్లోకి రానుంది. జనవరి 26 నుంచి ప్రీ బుకింగ్ ప్రారంభమయ్యాయి. SUV వేరియంట్ లో వస్తున్న ఇది  ఎక్స్టీరియర్ విషయానికి వస్తే దీనికి LED హెడ్ లాంప్స్ ఉండనున్నాయి. ఇవి ప్రీమియం లుక్ తో ఆకర్షిస్తున్నాయి. 18 అంగుళాల అల్లరి వీల్స్ ప్రత్యేక ఆకర్షణ. SUV కార్లలోనే శక్తివంతమైన డస్టర్ గా నిలవనుంది. ఇందులో పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ కలిపి హైబ్రిడ్ ఇంజన్ ను చేర్చారు. 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా ఇది.. 160 హార్స్ పవర్ తో పాటు 172 ఎంఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. అలాగే ఇందులో ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా సపోర్ట్ చేయనుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేయని ఉంది. అలాగే ఈ హైబ్రిడ్ ఇంజన్ 13.9 నుంచి 19.87 వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కొత్త డస్టర్ కారులో ఆకట్టుకునే స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. 10 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ మొబైల్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ sunroof వంటివి సౌకర్యవంతంగా ఉండలున్నాయి. అలాగే సేఫ్టీ విషయంలోనూ ఈ డస్టర్ ప్రత్యేకంగా నిలవనుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, లెవెల్ 2 ADAS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అయితే దీని ధర విషయంలో ఇప్పటికే చాలామంది అయోమయంలో ఉన్నారు. కానీ కంపెనీ మాత్రం అధికారికంగా దీని ధరను ప్రకటించింది. కొత్త రెనాల్ట్ డస్టర్ ధర రూ.9.50 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.19 లక్షల వరకు ఉంటుంది. దీంతో కొత్తగా SUV కొనాలని అనుకునేవారు.. సౌకర్యవంతంగా కారు ఉండాలని అనుకునేవారు దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu