దేశీయ మార్కెట్లో ఐక్యూ 15R స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్ తో పనిచేస్తుంది. దీంతోపాటు 7600mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. నేటి నుంచే ఈ హ్యాండ్‌సెట్‌ను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. తొలి సేల్‌లో భాగంగా గరిష్ఠంగా రూ.4000 డిస్కౌంట్‌ను అందిస్తామని ఐక్యూ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 4320Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది. HDR10+ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు 826 GPU కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 144Hz ఫ్రేమ్ రేట్‌ను కలిగి ఉంది. 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7600mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ బైపాస్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది. దీనిలో వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో 50MP సోనీ LYT-700V ప్రైమరీ కెమెరా ఉంది. 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్ 6, వైఫై 7, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. ట్రయంఫ్ సిల్వర్, డార్క్ నైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.44999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.47999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.52999 గా ఉంది. ఇండియా స్టోర్, అమెజాన్ ద్వారా ఈ ఫోన్‌ను ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఫోన్ సేల్ మార్చి 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. యాక్సెస్ బ్యాంకు, హెచ్డీఫ్సీ బ్యాంకు కార్డులపై రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను కూడా పొందవచ్చు.
ఐక్యూ 15R స్మార్ట్‌ఫోన్ విడుదల : నేటి నుంచి ముందస్తు బుకింగ్ ప్రారంభం
by Telugu Lo Computer at February 24, 2026
Labels:
business
,
iQOO 15R Smartphone Launched
,
Phone sale will start on March 3
,
Pre-bookings Start Today
,
Snapdragon 8 Gen 5 chip
,
technology
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment