భారత్-ఇజ్రాయెల్ మధ్య కీల ఒప్పందాలు కుదిరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు వ్యవసాయ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయి. మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా క్షిపణులు, డ్రోన్ల సాంకేతికత బదిలీపై ఒప్పందం జరిగింది. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్లో ఉమ్మడి పరిశోధనల కోసం ఒప్పందం కుదిరింది. భారత యూపీఐ సేవలు ఇజ్రాయెల్లో కూడా వినియోగించేలా అంగీకారం కుదిరింది. ఇక సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు, సమాచార మార్పిడి కోసం ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య 100 ఎక్స్లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి.
0 Comments