సైన్యంలో 18 ఏళ్లు దాటిన యువకులు పనిచేయడం తప్పనిసరి చేస్తూ కువైట్ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అయితే కుటుంబంలో ఒకే కుమారుడు ఉంటే సైన్యంలో కాకుండా ఇతర ప్రభుత్వ రంగాలలో విధులు నిర్వహించవచ్చని తెలిపింది. కొత్తగా చేసిన సైనిక చట్ట సవరణలో రిజిస్ట్రేషన్ గడువును 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతున్నట్లు తెలిపింది. సైనిక సేవ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని నాలుగు విభాగాల్లో మోహరిస్తున్నట్లు తెలిపింది. కువైట్ సాయుధ దళాలు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కువైట్ నేషనల్ గార్డ్, కువైట్ అగ్నిమాపక దళాలలో యువత సేవలందించాలని పేర్కొంది. 2015 చట్టంలోని లోపాలను అధిగమించడానికే ఈ నిబంధనలు తీసుకువచ్చినట్లు కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్ , దక్షిణ కొరియా, సింగపూర్ ,స్విట్జర్లాండ్ ఫిన్లాండ్ తో పాటు మరికొన్ని దేశాల్లో 18 ఏళ్లు దాటిన యువత సైన్యంలో పనిచేయడం తప్పనిసరి మరికొన్ని దేశాల్లో మహిళలు సైతం సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది.
18 ఏళ్లు దాటిన యువకులు సైన్యంలో పనిచేయడం తప్పనిసరి చేసిన కువైట్
by Telugu Lo Computer at February 24, 2026
Labels:
international
,
Kuwait makes it mandatory for young people
,
new military law amendment
,
over 18 to serve in the army
,
registration period from 60 days to 180 days.
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment