పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో భారీ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4 నమోదైంది. దీంతో జనం ఇళ్లు, ఆఫీసుల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. తొలుత బంగ్లాదేశ్‌లో భూకంపం చోటుచేసుకోగా తరువాత కోల్‌కతా నగరంలోనూ తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు సహా భవనాల నుంచి జనం బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ల వెలుపల గుమిగూడారు. భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌లో ఉన్నట్టు గుర్తించారు. ముందుజాగ్రత్త చర్యగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కార్యాలయాల నుంచి ఉద్యోగులను అధికారులు బయటకు పంపారు. కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఓ సభలో ప్రసంగిస్తుండగా భూప్రకంపనలతో కాసేపు ఆగిపోయారు. ఓ 63 ఏళ్ల మహిళ తాను కుర్చీపై కూర్చుని ఉండగా దానంతట అదే ఊగిందని, స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ ఫ్యాన్ కూడా కదిలిందని ఆమె చెప్పారు. ఇది ఐదు నిమిషాల పాటు కొనసాగిందని ఆమె పేర్కొంది. అయితే, భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. భూకంపం ఆగిపోయిన తర్వాత వస్తువులు వాటంతట అవే వేగంతో కదులుతుండటం ఆమె చూసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అగర్గావ్‌లోని బీఎండీ సీస్మిక్ సెంటర్.. దేశ నైరుతి దిశలో రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు పేర్కొంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు నైరుతిగా 191 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు భారత జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. బంగ్లాదేశ్‌లో నయాబజార్ వద్ద భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు పేర్కొంది. ఇది కోల్‌కతా నగరానికి 100 కి.మీ. దూరంలో ఉంటుంది. అందువల్లే కోల్‌కతా నగరంలో భూప్రకంపనల తీవ్ర అధికంగా ఉంది.
కోల్‌కతాలో భూప్రకంపనలు : రిక్టర్ స్కేల్‌పై 5.4 నమోదు
by Telugu Lo Computer at February 28, 2026
Labels:
5.4 on the Richter scale
,
according to the National Seismological Center of India
,
Earthquake in Kolkata
,
earthquake was 191 km southwest of the Bangladeshi capital Dhaka
,
national
,
west bengal
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment