మదీనా బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి


సౌదీ అరేబియాలోని మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌గ్రేషియా అందజేశారు. 44 మంది మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన ఒకరికి రూ.3 లక్షల పరిహారం అందజేశారు. మదీనా సమీపంలో నవంబర్ 17, 2025న జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ మదీనా ప్రమాదం గురించి తెలియగానే సహాయ చర్యలపైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని, మంత్రి అజారుద్దీన్‌ను వెంటనే మదీనా పంపించానుని గుర్తుచేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించదని, కానీ బాధితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించామని అన్నారు. నాంపల్లి అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకాన్ని ప్రజకు కలిగించామని చెప్పుకొచ్చారు. అందుకే కుటుంబాలను సెక్రటేరియట్‌కి పిలిచి పరిహారం అందించామని వివరించారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ఆందోళన చెందొద్దని అన్నారు. ప్రజల కష్టం, ఆనందంలో మీతో ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ నెల ముస్లింరులకు చాలా పవిత్రమైనదని, అంతా కలిసి మెలిసి ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. కొడంగల్‌లో 2009 నుంచి ప్రతి సంవత్సరం ప్రతి మండలం నుంచి ఒకరి చొప్పున తాను హజ్‌కు పంపిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org