రాగులకు సమానమైన పోషకాలు కలిగిన సజ్జలు, జొన్నలు, సామలు, కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సజ్జలులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్, సమృద్ధిగా ఖనిజాలు కలిగిన ధాన్యం ఇవి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి, గ్లూటెన్ రహితమైనవి కావడంతో గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, రక్తపోటు నియంత్రణకు మేలు చేస్తాయి, ఎముకల బలానికి ఉపయోగపడతాయి,సజ్జలను రోటీలు, దోశలు, ఉప్మా, జావ రూపంలో తీసుకోవచ్చు. జొన్నలులో ప్రోటీన్ మరియు ఫైబర్ సమృద్ధిగా కలిగిన ధాన్యం. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఎక్కువ సేపు పొట్ట నిండిన భావన కలిగిస్తాయి.. ఐరన్, మాగ్నీషియం, క్యాల్షియం, జింక్, విటమిన్ బీ-3 సమృద్ధిగా ఉంటాయి.. మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.. జొన్న రోటీలు, సంగటి, ఉప్మా వంటి వంటకాల రూపంలో తీసుకోవచ్చు. సామలులో తేలికగా జీర్ణమయ్యే, అధిక ఫైబర్ కలిగిన చిరుధాన్యం. ముఖ్యంగా వేసవికాలంలో తీసుకుంటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయని భావిస్తారు. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల మధుమేహ నియంత్రణకు మేలు.. మాగ్నీషియం సమృద్ధిగా ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.. గ్లూటెన్ రహితమైనది.. సామలను అన్నంలా, ఉప్మా, ఖిచిడీ, పరాటా వంటి రూపాల్లో తీసుకోవచ్చు. ప్రారంభంలో వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకుని, తర్వాత క్రమంగా పెంచుకోవచ్చు. కొర్రలులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన, అధిక ఫైబర్ ఉన్న చిరుధాన్యం. ఇవి శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, బి విటమిన్లు, మాగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, రక్తపోటు నియంత్రణ, గుండె ఆరోగ్యానికి మేలు, బరువు నియంత్రణకు సహాయపడుతుంది, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. రాగులతో పాటు సజ్జలు, జొన్నలు, సామలు, కొర్రలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సమతుల్యమైన పోషకాహారం పొందవచ్చు. మిల్లెట్లు శరీరానికి అవసరమైన శక్తి, ఖనిజాలు, విటమిన్లు అందించే సహజ ఆహారాలు.
0 Comments