గూగుల్ కొత్తగా నానో బనానా 2 ఫీచర్ ను విడుదల చేసింది. మొదటి వెర్షన్తో పోలిస్తే రెండో జనరేషన్ వెర్షన్ లో మరిన్ని కొత్త మార్పులు వచ్చాయి. నానో బనానా అనేది గూగుల్ ఏఐ ఇమేజ్ జనరేషన్ మోడల్. గొప్ప ఇమేజస్ క్రియేట్ చేస్తున్న బెస్ట్ ఏఐ మోడల్ గా యూజర్ల నుంచి కితాబు అందుకుంది. ఈ కొత్త వెర్షన్ పాత మోడల్ కంటే మంచి మెరుగుదల కలిగి ఉంటుంది. నానో బనానా సూపర్ ఫాస్ట్ గా ఇమేజ్ జనరేషన్ చేసి అందిస్తుంది. అయితే, నానో బనానా 2 మరింత వేగంగా మరియు ఫ్లాష్-లైన్-స్టైల్ స్పీడ్ లో పనిచేస్తుంది. అంతేకాదు, అదనపు క్లిష్టమైన ప్రాంప్ట్ లను సైతం చాలా తేలికగా హ్యాండిల్ చేసే శక్తి కలిగి ఉంటుంది. సాధారణ ప్రాంప్ట్ తో చిత్రాన్ని బాగా క్రియేట్ చేస్తుంది. అయితే, కొన్ని క్లిష్టమైన ప్రాంప్ట్ సమయంలో తటపటాయిస్తుంది. అయితే, నానా బనానా 2 మాత్రం కాంప్లెక్స్ లేదా సూక్ష్మ సూచనలను కూడా బాగా అర్థం చేసుకొని ఇన్స్ట్రక్షన్ ఫోలో చేస్తూ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అంటే, ఇది క్లిష్టమైన ప్రాంప్ట్ తో కూడా అద్భుతమైన ఇమేజెస్ క్రియేట్ చేయగలదు. ఒకే చిత్రంలో కొన్ని అంశాలను మాత్రమే కలప గలదు. అయితే, నాలో`నానో బనానా మాత్రం ఒకే సమయంలో గరిష్టంగా 5 పాత్రలు మరియు 14 వస్తువుల అస్థిత్వాన్ని స్థిరంగా ఉంచగలదు. ఇది అందించే ఇమేజ్ లో టెక్స్ట్ జనరేషన్ ఉండొచ్చు కానీ పరిమితి ఉంటుంది. కానీ నానో బనానా 2 మాత్రం స్పష్టమైన మరియు చదవగలిగే టెక్స్ట్ లతో ఇమేజ్ సృష్టిస్తుంది. అంటే, ఇది అనువాద ఇమేజ్ క్రియేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. నానో బనానా 2 మాత్రం 512px నుండి 4K రిజల్యూషన్ వరకు హై ఎండ్ ఇమేజ్ క్రియేషన్ కు సపోర్ట్ చేస్తుంది. ప్రముఖ వెబ్ సెర్చ్, సాంకేతిక రియల్ వరల్డ్ డేటా, ప్రపంచ జ్ఞానం నుండి ఇమేజ్ కోసం ఇన్స్పిరేషన్ తీసుకొని ఆబ్జెక్ట్ రెండరింగ్ ని మరింత కచ్చితంగా నిర్మిస్తుంది. అందుకే, ఈ కొత్త గూగుల్ జెమినీ కొత్త మోడల్ మరింత కచ్చితమైన మరియు అద్భుతమైన ఇమేజెస్ క్రియేట్ చేసే శక్తి కలిగి ఉంటుంది.
నానో బనానా 2 ఫీచర్ ను విడుదల చేసిన గూగుల్
by Telugu Lo Computer at February 27, 2026
Labels:
Compared to the first version
,
Google has released the Nano Banana 2 feature
,
technology
,
the second generation version has more new changes.
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment