Ad Code

8వ తరగతిలో వివాదాస్పద పాఠాన్ని ప్రవేశ పెట్టిన ఎన్సీఈఆర్టీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్చరిక


8వ తరగతి సోషల్ పుస్తకంలో 'న్యాయ వ్యవస్థ అవినీతి' అనే అంశాన్ని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ప్రవేశ పెట్టింది. అయితే ఇలాంటి పాఠ్యాంశాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చడం వివాదానికి దారితీసింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను తాము సహించబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. వివాదాస్పదమైన ఆ పాఠ్యాంశాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. అలాంటి అంశాలను చేర్చకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తంచేశాయి. అవి ఆమోదయోగ్యమైనవి కావని, వాటి స్థానంలో స్ఫూర్తిదాయక అంశాలు చేర్చాల్సిందని అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి విద్యార్థులకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధిస్తోందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో.. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ పాఠ్యాంశాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu