Ad Code

విమానయాన టిక్కెట్ల వాపసు నిబంధనలకు సవరణలను ప్రకటించిన డీజీసీఏ


డీజీసీఏ విమానయాన సంస్థల టిక్కెట్ల వాపసు నిబంధనలకు సంబంధించి అనేక సవరణలను ప్రకటించింది. దీంతో రిఫండ్స్ విషయంలో ప్రయాణికులకు ఊరట లభించనుంది. విమాన ప్రయాణీకులు టికెట్లు బుకింగ్ చేసిన 48 గంటల్లోపు అదనపు ఛార్జీ చెల్లించకుండానే వాటిని కొన్ని షరతులకు లోబడి రద్దు చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చని డీజీసీఏ తెలిపింది. అంతేకాకుండా టికెట్‌ను నేరుగా బుక్ చేసుకుంటే బుకింగ్ చేసిన 24 గంటల్లోపు ప్రయాణీకుడు ఏదైనా లోపాన్ని గుర్తిస్తే అదే వ్యక్తి పేరుతో దిద్దుబాటు కోసం విమానయాన సంస్థలు ఎటువంటి అదనపు ఛార్జీని విధించకూడదని పేర్కొంది. ఒక ప్రయాణీకుడు ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే రిఫండ్ బాధ్యత విమానయాన సంస్థలదే అని డీజీసీఏ తెలిపింది. ట్రావెల్ ఏజెంట్, పోర్టల్ ద్వారా టికెట్ కొనుగోలు చేసినట్లయితే, ఏజెంట్లు వారి ప్రతినిధులు కాబట్టి వాపసు బాధ్యత విమానయాన సంస్థలదేనని స్పష్టం చేసింది. వాపసు ప్రక్రియ 14 పని దినాలలోపు పూర్తయ్యేలా విమానయాన సంస్థలు చూసుకోవాలని సూచించిది. ప్రయాణీకుడు వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా టిక్కెట్ రద్దు చేసుకునే నిబంధనలకు సంబంధించి మార్పులు చేసింది. తాజాగా తలెత్తిన ఇండిగో సంక్షోభం, ప్రయాణికుల రిఫండ్ సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.

Post a Comment

0 Comments

Close Menu