Ad Code

బాణాసంచా కేంద్రంలో భారీ ప్రేలుడు : 18 మంది దుర్మరణం


ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం - జి మేడపాడు గ్రామాల మధ్య వున్న  బాణాసంచా కేంద్రంలో  భారీ ప్రేలుడు సంభవించింది. మందుగుండు సామాగ్రి తయారీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ప్రమాద సమయంలో సుమారు 20 మంది వరకు కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయినట్లు, సమీపంలోని ఇళ్లు దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.

Post a Comment

0 Comments

Close Menu