Ad Code

ఐఐటీ బాబా అరెస్ట్ : నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు ఆరోపణ


త్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఐఐటీ గ్రాడ్యుయేట్ మధురై బాబాగా పేరొందిన అభిషేక్ మిశ్రా అలియాస్ అధికార్త నారాయణ్ దాస్ పోలీసుల చేతికి చిక్కాడు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆధ్యాత్మిక గురువుగా నటిస్తూ యువతులను లైంగికంగ దోచుకోవడం, వారిని, వారి కుటుంబాలను బ్లాక్‌మెయిల్‌ చేయడం లాంటి ఆరోపణలతో పోలీసులు అతగాడిని అరెస్ట్‌ చేశారు. ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశ చూపి విద్యావంతులైన యువతులను లైంగికంగా దోపిడీ చేస్తున్న ఆరోపణలపై మిశ్రాను సోమవారం రాధా కుండ్‌లోని అతని ఆశ్రమంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతులను లైంగికంగా వేధించడమే కాకుండా వారి నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులు ఆ ప్రాంగణం నుంచి ఇద్దరు యువతులను, ఒక యువకుడిని కూడా రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు. మే 25న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 22 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని గోవర్ధన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మిశ్రా తనకు 'ప్రసాదం' అని చెప్పి పాలు ఇచ్చాడని, అందులో మత్తు కలిగించే పదార్థం ఉందని నర్సింగ్‌ విద్యార్థిని ఆరోపించింది. పాలు తాగిన తర్వాత తాను స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత అతను తనపై అత్యాచారం చేసి, అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశాడని ఆ మహిళ ఆరోపించింది. ఈమె ఫిర్యాదు మేకు కేసు నమోదైంది.

Post a Comment

0 Comments

Close Menu