భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తలపెట్టిన కిసాన్ సమ్మేళనాలలో భాగంగా మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘మహా కిసాన్ సమ్మేళన్’లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బకొడుతుందని, ఈ వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోడీ అమెరికా ఒత్తిడికి పూర్తిగా లొంగిపోయారని అన్నారు. అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం రాబోయే ఐదేళ్లలో భారత్ ఆ దేశం నుంచి రూ.9 లక్షల కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని రాహుల్‌గాంధీ చెప్పారు. దానివల్ల దేశీయ పరిశ్రమలు, ముఖ్యంగా వ్యవసాయ, టెక్స్‌టైల్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. టెక్స్‌టైల్ రంగాన్ని ఇప్పటికే నాశనం చేశారని విమర్శించారు. బంగ్లాదేశ్‌కు సున్నా శాతం సుంకాలు ఇచ్చిన అమెరికా తమ నుంచి పత్తి కొనాలంటూ భారత్‌పై ఒత్తిడి తెస్తోందని రాహుల్ విమర్శించారు. ప్రధాని మోడీ తన రాజకీయ భవిష్యత్తును, వ్యక్తిగత ఇమేజ్‌ను కాపాడుకోవడానికే అమెరికా ఒత్తిడికి తలొగ్గారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి ఈ మెయిళ్లు, వీడియోలతో సహా కీలక ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ఇంకా బయటపెట్టలేదని అన్నారు.
0 Comments