సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అడోబ్ సీఈవో శంతను నారాయణ్


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా సీఎంతో శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై AI ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్‍కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎకానమీపై ఏఐ రెవల్యూషన్ ప్రభావం, రాబోయే రోజుల్లో AI ని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారాయణ్‍తో సీఎం చర్చించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని సీఎం కోరారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org