విటమిన్ B12 లోపం వల్ల మొదట్లో చిన్నపాటి అలసటగా మొదలై, చివరకు నరాలు మెదడు పనితీరును దెబ్బతీసే వరకు వెళ్తుంది. చాలామంది దీనిని సాధారణ నీరసమని పొరబడతారు. విటమిన్ B12 లోపం మొదటి సంకేతం అంతుచిక్కని అలసట. తగినంత నిద్రపోయినా, విశ్రాంతి తీసుకున్నా శరీరం రోజంతా నీరసంగా అనిపిస్తుంటే అది మీ రక్తకణాలకు B12 అందడం లేదని అర్థం. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో ఈ విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తగ్గినప్పుడు ఆక్సిజన్ సరఫరా మందగించి కణజాలం శక్తిని కోల్పోతుంది. దీనివల్ల చిన్న పని చేసినా ఆయాసం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతాయి. రెండవది ‘నరాల బలహీనత’. చేతులు లేదా కాళ్లలో తరచూ చీమలు పాకినట్లు అనిపించడం, సూదులతో గుచ్చినట్లు ఉండటం లేదా మొద్దుబారిపోవడం వంటివి జరిగితే అది నరాల చుట్టూ ఉండే రక్షణ కవచం దెబ్బతింటోందని సంకేతం. ఇది కేవలం శారీరక సమస్యే కాదు మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. చిన్న విషయాలకే చిరాకు పడటం మతిమరుపు, ఏకాగ్రత లోపించడం వంటివి B12 లోపానికి ప్రత్యక్ష నిదర్శనాలు. దీనిలో ‘నాలుక వాపు లేదా మంట’ అనేది ఒక ప్రధాన లక్షణం. నాలుక ఎర్రగా మారి చిన్న చిన్న పుండ్లు రావడం, రుచి తెలియకపోవడం వంటివి గమనించాలి. అలాగే చర్మం రంగు మారి పాలిపోయినట్లు లేదా పసుపు రంగులోకి మారడం కూడా ఈ విటమిన్ లోపం వల్ల రక్తకణాలు విచ్ఛిన్నం అవుతున్నాయని చెప్పేందుకు ఒక గుర్తు. చాలామంది వీటిని వేడి చేయడం వల్లే అనుకుని పొరబడుతుంటారు. నడిచేటప్పుడు తడబడటం లేదా కళ్లు తిరగడం వంటివి జరిగితే అది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని అర్థం. ముఖ్యంగా శాఖాహారులలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే B12 సహజంగా జంతు సంబంధిత ఆహారంలోనే లభిస్తుంది. అయితే దీనిని ముందే గుర్తిస్తే సప్లిమెంట్లు లేదా సరైన ఆహారం ద్వారా సులభంగా అధిగమించవచ్చు.
విటమిన్ B12 లోపం - లక్షణాలు
by Telugu Lo Computer at February 26, 2026
Labels:
ants crawling in your hands or feet
,
arogyam
,
cause fatigue and rapid heartbeat even after doing small tasks
,
feeling like you are being pricked by needles
,
Health Tips
,
Vitamin B12 Deficiency - Symptoms
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment