అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ మీడియాతో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయనే భయాలు అతిశయోక్తి కావచ్చునని, అభిప్రాయపడ్డారు. ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొలగించడం కంటే, పని స్వభావాన్ని ఏఐ పునర్నిర్మించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. గత రెండు మూడు దశాబ్దాలుగా మానవ శ్రమపై ఎక్కువగా ఆధారపడిన అనేక పనులకు భవిష్యత్తులో తక్కువమంది అవసరమవుతారని జెస్సీ అంగీకరించారు. అయితే దీనివల్ల ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని అర్థం కాదన్నారు. గత 20-30 ఏళ్లుగా మనం మానవ శ్రమతో చేస్తున్న చాలా పనులకు భవిష్యత్తులో అంతమంది అవసరం ఉండకపోవచ్చునని తాను నమ్ముతున్నానని చెప్పారు. కానీ అదే సమయంలో కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయని తెలిపారు. ప్రతి సాంకేతిక మార్పు జరిగినప్పుడు ఇలాగే జరిగిందని ఆయన వివరించారు.
ఏఐతో ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవవు - వాటి స్వరూపం మారుతుంది !
by Telugu Lo Computer at February 28, 2026
Labels:
Amazon CEO Andy Jesse
,
business
,
Jobs won't disappear completely with AI
,
technology
,
they'll change their nature
,
told the media
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment